Feeds:
Posts
Comments

నైన్…సున్నాసున్నా సున్నా సున్నా ఒకటి…..
నే: ఎవరైఉంటారబ్బా?
హలో ….
రత్నాకర్ ని రా మామ…
నే: సలాం వాలేకుం రత్తి మియా….
ర: హౌలే …హిందీ ఏంటి రా ..తెలుగువారం తెలుగు లోనే మాట్లాడుదాము
నే: ఏదో మీ ఓల్డ్ సిటీ ల గిట్లేనే మాట్లాడుకుంటారు అనుకుని గట్ల నమస్కారం జేసిన.శానా రోజులకు…పురాగ నల్లపూసైనావు.
    వీడియో శూటింగ్స్ అయిపోయాయా..పెళ్ళెప్పుడు మామ..చంపపేట్ లో ఏ గార్డెన్ కి రావాలి…
ర: ఆగరా అయ్యా…తొందరెందుకు…
నే: విషయం చెప్పు
ర: ఎం లేదురా మొన్న లాప్టాప్ కొన్న డెల్ కంపెనీ..బాగుంటుందా..
నే: బాగుంటుందా?? కొన్నాక డౌట్ ఎందుకురా వారి  ..ఇంతకీ కాంఫిగారషన్ చెప్పరా…
ర: ౩౦౦….
నే: అబ్బో ఎం సినిమా రా అది ..సూపర్ సినిమా రా …పెర్షియన్ రాజు xerxes ని బలే  చూపిస్తారు రా ..హాలీవుడ్ డిరెక్టర్లు ఆ మజాకా.
   బాలీవుడ్ సినిమా రేంజ్ సినిమారా అది ..చరిత్ర ని ౩౦౦ ముక్కలు చేసి హాలీవుడ్ జిగురు తో అతికించేసి మహా గొప్ప సినిమా అని డబ్బా కొట్టారు రా …
ర: వోర్నాయనో …ఎక్కడనుంచి ఎక్కడికో వెళ్ళవు రా ..మీ గచిబౌళి నుంచి మా మిదానికి కి వెళ్లినట్టు.విష్యం మొత్తం విను  ముందర…తరువాత
   …౩౦౦ gb లాప్టాప్ రా…మిగితావి నాకు తెలీదూ.నీకు బాగ తెలుసు కదా..నీకో ఫ్రీ సర్జరీ చేసిపెట్టుతా గాని ..
    ఎవరైనా అడిగితే చెప్పలేకపోతున్నాను రా కంప్యూటర్ డీటైల్స్.నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని ఫోన్ చేశా ..
నే: సరే గాని అదేదో ఫ్రీ సర్జరీ అన్నావుగా..ఈ మద్య ఒంట్లో కొవ్వు బాగా చేరిపోయింది నువ్వేమైనా ఫ్రీ గా చేక్కేసేయగలవా???
ర: రోజు ఎక్సెర్ సైజులు చేయర అదే తగ్గుతుంది..
నే: తోక్కులోది దీనికి నీ ఉచిత సలహా ఎందుకు .."టాక్ అండ్ వాక్" అని కోటి రూపాయల సలహా ఇచ్చాడులే మా అభిషేకు..
ర: అన్న నిన్ను గెలవలేము గాని ..కంప్యూటర్ గురించి ఎలా తెల్సుకోవాలి రా …
నే: ముందర స్తేతేస్స్కోపు తీసుకుని …
ర: మళ్లీ జోకులా…
నే: సరే ఈ సారి సీరియస్ గా ….
మై కంప్యూటర్ ఐకాన్  మీద రైట్ క్లిక్ చేస్తే నీ సిస్టం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది


My Computer>Rt click>Properties

వచ్చాయా డీటైల్స్ ?

వచ్చిన ఇన్ఫర్మేషన్ లో

విండోస్ ఎడిసన్ అంటే XP ఆ లేకా విస్టా నా లేకా విండోస్-7 + సర్వీసు ప్యాక్

మెమరీ లేదా RAM-కంప్యూటర్ లోని చిన్న మెదడు

ప్రాసస్సర్ -కంపెనీ (ఇంటెల్ ఆ లేకా AMD)-కంప్యూటర్ లోని పెద్ద మెదడు.. ఇవి ముఖ్యం

ర: ఇంత ఈజీ ఆ ..
నె: అవును అంతే ఈజీ ..
నే: ఇప్పుడు ఇంకో టిప్ …
ఈ లింక్ క్లిక్ చెయ్యి

CPU-Z

cpu-z

ఇక్కడ ఉచితంగా లబించే సాఫ్ట్వేర్ CPU-Z ని డౌన్లోడ్ చేసుకో..ఇంస్టాల్ (జిప్ ఫైల్ అయితే ఇంస్టాల్ లేకుండానే పనిచేస్తుంది).
లేదా ఇదిగో WINAUDIT అన్న ఇంకో సాఫ్ట్వేర్ కూడా Cpu-z లానే పనిఒచేస్తోంది.ఇంష్టలేషన్ చేసుకోనక్కర లేదు.

WINAUDIT

winaudit-2

ర: థాంక్స్ అన్న..
నే: థాంక్స్ వద్దు రా …. మా బ్లాగ్ లోకం లో నెనర్లు అంటారు దాన్ని..
ర: దేన్నీ
నే: థాంక్స్ ని
నెనర్లు ..నెనర్లు …ఉంటా మరి …

డాక్టర్ సాబ్ ఎక్కడ?
నేను: చెప్పు కేశవ..
కే: మావోడు అమెరికా నుంచి లాప్టాప్ పంపిండు
నే: ఇంకేంది మరి ..సెమినార్లు లో ప్రజంటేషన్ల  గోడవ పోయింది
కే: అంత మంచిగనే ఉంది గాని ..కొత్త సాఫ్ట్వేర్ లు లోడ్ చేసుకోవాలి ..నువ్వు వస్తే పని తొందరగా అయిపోతుంది..
MS Office 2007 ఉంది కాని మిగితా సాఫ్ట్వేర్ లు లేవు..
నే: గాదానికి గంత దూరం రావన్న…మరి నాకేంటి…
కే: లాప్టాప్ తో  పాటు ఇంగ్లీష్ Alfred Hitchcock ఒరిజినల్ DVD లు ఉన్నాయ్.నీకు అవి కావాలంటే రా..
నే: ఉమ్..
కే: ఎం సోచుతున్నావ్ …
నే: ఎం లేదు పని ఎక్కువుంది..నేను రాలేను గాని ఇంట్ల నెట్ ఉందా?
కే: నీకు తెల్వదా ..
నే: అయితే ఓ పని చేయి ..ఓ లింక్ పంపిస్తా ..
కే: పంపిస్తే ..
నే: జరా చెప్పనీ రాదే..ఇష్టోరీ మొత్తం ఇను
నే: గా లింక్ ని  క్లిక్ క్లిక్ చేసి వెబ్సైటు కి వెళ్ళు .ఈ వెబ్సైటు లో మనం రోజువారి కంప్యూటర్ పనులకు ఉపయోగా పడే సాఫ్ట్వేర్ లో పద్ధతి ప్రకారం అమర్చబడి ఉంటాయి..కావాల్సిన సాఫ్ట్వేర్ ఎదురుగా చెక్ బాక్స్ లో టిక్ చేసుకుని అన్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు…

http://ninite.com/

ninite final 


కే: అందులో ఏవి (సాఫ్ట్వేర్) అవసరమో ఎలా తెల్సుకోవాలి
నే: ఒక నిమిషం ..పెన్ పేపర్ తెచ్చుకో..లిస్టు చెబుతా
మొదటి లిస్టు ..బ్రౌజర్లు..అంతర్జాల సమాచారాన్ని వీక్షించడానికి
ఈ లిస్టు లో ఉన్నవాట్లో నేనయితే ఫైరుఫాక్సు కి టిక్ కొట్టుతా .రెండో స్థానం.ఒపేరా/క్రోం..

మెస్సేజింగ్ కోసం

పిడ్గిన్ లేదా దిగ్స్బి(Pidgin/Digsby)-ఇందులో ఏదైనా ఒకటి ఇంష్టాల్ చేసుకుంటే..యాహూ మెసెంజర్,జీ టాక్,గాడు గాడు ,ఐ సీక్ యు ,ఇంకెన్నో మెసెంజర్ లు లోడ్ చేసుకున్నట్టే ..

మీడియా లో
పాటలు వినడానికి WINAMP బదులు AIMP 
వీడియోలు చూడడానికి VLC  లేదా KM ప్లేయర్
పాటలు కత్తరించి రింగ్ టోన్ లు తయారు చేసుకోడానికి AUDACITY

ఇమేజింగ్ లో
తాతల నాటి నుండి వస్తున్న MS Paint ప్రోగ్రాం కి బదులుగా కంప్యూటర్ లో భారి స్థలం ఆక్రమించని బుల్లి కతర్నాక్ పెయంట్ ప్రోగ్రాం

PAINT.NET
పికాసా-కెమెరా లో క్లిక్ మనిపించిన అందమయిన ఫోటో లను సిస్టం లో వెతికి ఓ క్రమ పద్ధతి లో పెట్టుకోవడం కోసం

డాకుమెంట్స్ లో

ADOBE REDER బదులు FOXIT

ఆంటీవైరస్ లో AVG

రన్ టైమ్స్ లో అన్ని ..

ఫైల్ షేరింగ్ లో UTORERNT


ఉటిలిటీస్ లో 

IMGBURN లేదా CDBURNERXP -నీరో కి బదులుగా

కంప్రేశంస్ లో 7-ZIP 

డెవలపర్  టూల్స్ లో NOTEPAD++

హా కేశవా…రాసుకున్నావా …ఇవి చాలు ఇప్పటికి ముందు ఆ సైట్ పట్టు సాఫ్ట్వేర్లు  డౌన్లోడ్ కొట్టు ..
ఇంకేమైనా ఉంటె నా హెల్ప్ లైన్ కి మెసేజ్ పెట్టు..
కే: షుక్రియా పెద్దన్న..
నే: అన్నగంత పెద్ద మాటలెందుకుగాని ..గా "హిచ్ కాక్"  ని పార్సల్ చెయ్యరాదే…ఉంటమరి …

ట్రింగ్ ట్రింగ్ ..ముక్కలా ముకాబుల లైలా …
ఆ ఆఆ  ఆయా
ఎక్కడుంది ఈ మొబైల్ ,కనిపించి చావదే
….ఓ లైలా ఓ లైలా ….
ఒరేయ్ ముజ్ను ఏదిరా ఎక్కడరా ఫోన్ -ఈ ఫోన్ రింగ్ టోన్ మార్చింది ఎవడురా (మా జుజుల్ గాడు ఆఫీసు లో ఫోన్ తో అడుకున్నట్టు గుర్తు…రేపు వాడి పని పట్టాలి)
ఈ చీకటిలో ఎక్కదాకున్నావే లైలా …
హమయ్య మొత్తానికి పారిపోయి మెత్త క్రింద దాక్కున్నావా వగలాడి…..
ఎవడురా ఇంత రాత్రి ఫోన్ చేసింది అని చూస్తే “వాళ్ళ” అమెరికా నుంచి మా తమ్ముడు

నేను : ఎన్న తంబి ..మంచి నిద్ర చెడగొట్టావూ …అసలే జెమిని సీరియల్ ” పాయసం ” సీరియల్ లో రేపు ఏడుపుగొట్టు సుందరాంగి
టేబుల్ ఫ్యాన్ కి ఎలా ఉరేసుకుంటుంది…..???
అసలు ఇది సాధ్యమా ..??? (ఎవడికి తెలుసు బాబు …ఉండు రాత్రి నేరాలు ఘోరాలు చూసి చెబుతా) తరువాయి భాగం లో చూడండి….
అంటూ ఆపేసాడు సస్పెన్స్ లో పెట్టి…అసలు  టేబుల్ ఫాన్ కి ఎలా ఉరేసుకుంటుంది అని అలోచించి చించి అలా నిద్రపట్టేసింది..
కలలోనైనా ఏక్తా కపూర్ కనిపించకపోదా అడిగేద్దాం అనుకున్నా…..”ఏ-కతా” కపూర్ హాయ్ అనిందో లేదో ఇదిగో “లైలా” వినిపించింది

చెప్పరా ఏంటి విశేషాలు అన్నాను
తంబి : అన్నోయ్ …..
నేను : ఏంటి రా ..ఒక్క మొగాడు ఇలా ఏడవడం ఏంటి ……నో …నేను ఒప్పుకోనంతే అన్నాను..
తంబి : అన్నోయ్ ….రేపు ఇంటర్వ్యూ ఉంది అన్నాడు..ఆ
నేను : …మరి ఏంటి రా ..గూగ్లమ్మ లోంచి ….”హౌ టు బ్లాస్ట్ ది  ఇంటర్వ్యూ” అని టైపు చేసి జవాబుల చిట్టి పట్టుకెళ్లు అన్నాను…
తంబి ; అన్నోయ్ …..
నేను : ఒరేయ్ ఆ పిలుపు ఆపరా…నాన్నోయ్ పులి కథ గుర్తుకొస్తోంది..
తంబి : యా..ఆపేస్తాను.
(నేను : అబ్బో వీడికో ఇంగ్లీష్ “యా”-స బాగానే అబ్బింది అనుకున్నాను..)
తంబి : బ్రో…
నేను : మళ్లీ ఇదేం పిలుపురా ..
తంబి : అన్నయ్య ..బ్రో అంటే బ్రదర్..
నేను : సరేగాని చెప్పరా ఏంటి సమస్యా ?
తంబి : అన్నయ్య రేపు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ..టై కట్టుకుని వెళ్లి ఇంటర్వ్యూ ని టై కి కట్టేసుకుని వద్దాము అనుకుంటే ..
టై కట్టుకోవడం రాదూ అని గుర్తుకొచ్చి….ఏడుపొచ్చి నువ్వు గుర్తొచ్చి నీకు ఫోన్ చేశా
నేను : మీ మిగితా “ఒక్క అమెరికా మగాళ్ళు” ను కనుక్కోపోయావా?టై ని ఎలా కట్టుకోవాలో?
తంబి : ఆన్నయ్య…ఒకడే ఉన్నాడు రూం లో ..వాడు నిన్నే వచ్చాడు…ఎర్ర బస్సు బ్యాచీ… వాడునూ ..
నేను : ఒరేయ్ ఎర్ర బస్సు అంటే అంత చులకనా?..ఎర్ర బస్సు ఎర్ర బస్సు ఎన్ని ఎల్లో… ఎర్రన్ని బస్సు ఎన్ని ఎల్లో అంటూ నాలోని భారతీయుడు మేల్కున్నాడు..
తంబి : అన్నోయ్ చెంపలేసుకుంట..తప్పైంది..”ఈ రోజు ఎర్ర బస్సులే రేపటి అమెరికా ఎల్లో టాక్సీ క్యాబులు”..సరే గాని ఎలా ఇప్పుడు టై ప్రాబ్లం కి బై ఎలా చెప్పాలి….నువ్వే ఏదైనా చేయి అన్నాడు ..
నేను : హే…..కృష్ణా..
ఫోన్ లో చెప్పడం కష్టం చిన్న ..నువ్వు టై ని ఫోన్ కి కట్టేస్తావు రా బుజ్జి ..లాప్టాప్ ఆన్ చేయి నీకో లింక్ పంపిస్తాను అందులో చూడు నీ ప్రాబ్లం ఉష్ కాకి.
తంబి : త్వరగా ఆన్నయ్య ..సి…. ఐ.. హావ్ ……నో టైం అన్నాడు వాడు..
నేను : నీ ఇంగ్లీష్ తగిలేయ్య …నెట్ ఆన్ చేసి చాట్ లోకి రా రా…
ఇదిగో లింక్…..

http://www.2tieatie.com/

Tie
తంబి : ఓస్ ఇంతేనా …అన్నయ్యా…యా
రాగాలు ఆపి ..ఇంటర్వ్యూ బాగా చెయ్యి ..టై కాదు ముఖ్యం ..ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వరా  నా “ఏ-కథ” కపూర్ పిలుస్తోంది రా ..
నిద్రాదేవతా….నన్ను చేరుము..హాం ఫట్…..

మన హైదరాబాద్ లో ప్రతి నెల కంప్యూటర్ కి సంబంధించి మిత్రులు కొందరు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నాము.ఈ సమావేశాలకి మీరు రావొచ్చు అంటూ మీకు ఈ బ్లాగ్ ద్వార ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సమావేశాల్లో 3 ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి.ఎవరైనా ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడవచ్చు.ఇక్కడ అందరు మిత్రులమే కొత్త పాత అంటూ ఏమి లేదు. సమావేశానికి ముందుగానే టాపిక్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
ఈ నెల మీటింగ్ 29 న ఉంది.ఈ సమావేశం లో ఈ కింది టాపిక్స్ అనుకున్నాము
౧)5s విధానం తో మీ కంప్యూటర్ లో ఫోల్డర్లని ఎలా అమర్చుకోవాలి.
౨)
౩)
అరె ! ఏంటండీ మిగితా టాపిక్స్ ఎవయ్యాయి? ఇంకేం అనుకోలేదు …కొత్త టాపిక్స్ అన్వేషిస్తున్నాము
3-:30 pm >>>>పరిచయాలు
3:30-4:00pm>>>>>టాపిక్ 1>>5 min feedback
4:05-4:30pm>>>>>టాపిక్ 2>>5 min feedback collection
4:35-5:00pm>>>>>>>టాపిక్ 3>>5 min feedback collection
5:10-6:00-కొత్త WEBSITES అండ్ SOFTWARES గురించి -డౌట్స్ కూడా
6 తరువాత టీ స్నాక్స్ >>>>ఇంటివైపు
సమావేశ స్థలము 
కృష్ణ కాంత్ పార్క్
యూసుఫ్-గూడా
హైదరాబాద్
Meet-up Venue
Krishna kanth Park
Yousufguda
Hyderabad
Every Month Last Sunday
ఇంకేవైనా సలహాలు సూచనలు ఉంటె మెయిల్ చేయగలరు.

Cera

మీ సలహాల కోసం ఎదురుచూస్తూ 

 

~~పవన్~~

ఇంటర్నెట్ లో మీకు కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని తాజాగా క్లుప్తంగా అందించే కొన్ని సైట్స్ ని ఇక్కడ మీ కోసం

www.twitter.com/ceratechies


www.twitter.com/techsetu


http://twitter.com/tidbits_co_in

~~~మీ పవన్ ~~~

@Cera మీటింగ్ -అక్టోబర్/నవంబర్-1/2009

రెండు నెలల తరువాత మళ్లీ కే కే పార్క్(కృష్ణ కాంత్ పార్క్),యూసుఫ్-గూడా లో కంప్యూటర్ మిత్రబృందం మళ్ళి కలవడం జరిగిందీ.కొన్ని పాత మొహాలు -ఇందులో నేను ఉన్నాను అనుకోండి.మొత్తానికి ఓ పదిహైదు జనం.

ఈ సారి సమావేశం మొత్తం ఈ ఒక టాపిక్ చర్చించడమే జరిగిందీ. శ్రీధర్ గారు “విండోస్-7” ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన OS లో స్టేబుల్ ఓస్ అని చెబుతూ,16 GB హార్డ్ డిస్క్ స్పేస్ అవసరమని చెప్పారు. ఈ సమావేశం లో విండోస్ -7 గురించి విపులంగా చర్చించాము.నేను అక్కడక్కడ కొత్త విస్టా,xp కి మరియు ఈ కొత్త OS కి తేడాలు మరియు  కొన్ని ప్రొడక్టివిటీ features గురించి సమాచారం అందించాను. ఆ తరువాత శ్రీధర్ గారు Windows-7  డెమో  తన దగ్గర ఉన్న లాప్ టాప్ లో ఇచ్చారు.

ఈ సమావేశం లో చర్చించిన అంశాలు విషయాలు మీ కోసం (అదనపు సమాచారం మరియు లంకెలు)

Windows-7 review

Windows-7 Features A-Z

నేను అనుకున్న టాపిక్ వచ్చే మీటింగ్ కి వాయిదా వేయడం జరిగింది.కొత్త మిత్రుల్లో ఉత్సాహం-ఈ ఉత్సాహాన్ని ఇలానే కాపాడుకుని వచ్చే మీటింగ్స్ లో వారి మిత్రులతో వస్తారని ఆశిస్తూ….

~~పవన్~~

మే cera పాఠకుల మీటింగ్ చాల బాగా జరిగిందీ.మొత్తం 25గురు cera పాఠకులు హాజరయ్యారు.విశేషం ఏంటంటే మీటింగ్ కి అనంతపూర్,ఖమ్మం నుంచి రీడర్ మిత్రులు విచ్చేశారు.ఈ సారి మీటింగ్స్ లో సృష్టమైన టాపిక్స్ వాటి మీద చర్చ ఉండబోతుంది అని గత మీటింగ్ లో చెప్పడం జరిగిందీ -ఈ విషయమే మన మిత్రులకు ఫోరం ద్వార చేరవేయడం జరిగిందీ.కాని పని వత్తిడిలో టాపిక్స్ ఫై సమాచారం సేకరించడం  వీలు చిక్కలేదు.టాపిక్స్ ఫై ఓ గంటలో నెట్ లో సమాచారం సేకరించి,లాప్ టాప్ లో ఇదివరకే సేకరించిన  సమచారినికి జోడించి onenote(MS onenote) లో భద్రపరుచుకుని వెళ్ళాను.టీవీ లో తీరాన్ని చేరిన రుతుపవనాలు అన్న వార్త ,ఎక్కడ వర్షం పడుతుందా?అన్న సందేహం తో కృష్ణ కాంత్ పార్క్ వైపు బైక్ ని పరుగులెత్తించాను.

30ని లో కృష్ణ కాంత్ పార్క్ చేరుకున్నాను.శ్రీధర్ గారితోపాటు ఇంకొందరు రెగ్యులర్ cera మిత్రులు (చదేర్ఘాట్ శ్రీనివాస్ గారు,శ్రీనివాస్ పిరాట్ల,పట్టాభి గారు) అక్కడ కనిపించారు.ఎప్పుడు కూర్చునే రెగ్యులర్ ప్లేస్ కాకుండా ఇంకాస్త ముందుకెళ్ళి కూర్చున్నాము.మీటింగ్ లో డిస్కస్ చేసే టాపిక్స్ printouts ని శ్రీధర్ గారు అందరికి పంచారు.ఒకరిద్దరు పాఠకులు మొదటిసారి రావడం వాళ్ళ కాస్త ఆలస్యమైనా మీటింగ్ ప్లేస్ చేరుకున్నారు.
మొదటగా పరిచయాలతో ప్రారంభించాం.తర్వాత నేను మొదటి టాపిక్”గూగుల్ సెర్చ్ కాకుండా ఇతర సెర్చ్ ఇంజన్స్”
ఈ టాపిక్ ఫై మాట్లాడుతూ నేను  రీడర్ మిత్రులకు కొన్ని సెర్చ్ ఇంజన్స్ పరిచయం చేసాను .వాటి లింక్స్ క్రింద చూడొచ్చు

విజుయల్ సర్చ్ ఇంజన్స్

Cooliris

SearchMe

Viewzi

సర్చ్ ఇంజన్స్

Quintura
Kosmix
Download Any Stuff

VideoSurf
Docjax

Yahoo Glue

Search.io

మెటా సర్చ్ ఇంజన్స్

Clusty

Dogpile

Mamma

Zuula

InfoGrid

http://www.infogrid.com

Ithaki

http://www.ithaki.net/indexu.htm

IxQuick

http://www.ixquick.com/

Kartoo

http://www.kartoo.com

SurfWax

http://www.surfwax.com

Vivisimo

http://vivisimo.com/

టాపిక్స్ మధ్యలో సందేహాలు,తెలియని సమాచారాన్ని పేపర్స్ ,మొబైల్స్ లో నోట్ చేసుకుంటూ మన మిత్రులు కనిపించారు .మొదటి టాపిక్ మంచి డిస్కషన్ తో ముగిసిన తరువాత కొన్ని స్క్రీన్ షాట్స్ చూపించాను నా లాప్టాప్ లో .

ఇంతలో లో రెగ్యులర్ గా రీడర్ మీటింగ్స్ కి వచ్చే మిత్రుడు భాను ప్రతాప్ గారు ఉబుంటు 9.04 సీడీ లు కొన్ని (21)పంచారు.ఉబుంటు గురించి స్క్రీన్ షాట్స్ తో సహా నేను ఏప్రిల్ మీటింగ్ లో చర్చిండం జరిగిందీ .రీడర్ మితులకు లినక్సు-ఉబుంటు 9.04 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిచయం చేసాను.ఆ తరువాత కొంత సేపు చర్చ తరువాత   మీటింగ్ ఫొటోస్ ని మిత్రులు సాయి గారు,శ్రీధర్ గారు,శ్రీనివాస్ పిరాట్ల గారు కెమెరా లో బంధించారు.

టాపిక్ -2 లో చర్చకు వచ్చిన అంశం-“గూగుల్ సెర్చ్ చిట్కాలు “

define,related,site,inurl,insite,గూగుల్ లో maths చిట్కాలు,మనకు కావాల్సిన డాకుమెంట్స్ ని త్వరగా సర్చ్ చేయడానికి వాడాల్సిన కొన్ని సెర్చ్ టిప్స్ (filetype:pdf) లాంటి వాటిని మిత్రులకు పరిచయంచేయడం జరిగిందీ.
డిస్కస్ చేసిన టిప్స్ అండ్ ట్రిక్స్ కి క్రింద లింక్స్ ఇచ్చాను చూడండి.

గూగుల్ చిట్కాలు ౧

గూగుల్ చిట్కాలు ౨
మూడో టాపిక్ మొదలు పెట్టె ముందు వర్షం భోరున కురియడం వల్ల పక్కనే ఉన్న కుటీరం లోకి పరుగుతీసాం.
బయట వాతావరణం చల్ల బడింది .మిత్రులు పాత కొత్త అంత మొబైల్ నంబెర్స్ మార్చుకుంటూ,సందేహాలను తీరుస్తూ,కొత్త మిత్రులను పరిచయం చేసుకుంటూ కనిపించారు.
వర్షం కాస్త తగ్గాక కాంటీన్ వెళ్లి వేడి వేడి బజ్జిలూ,పకోడీ లు లాగించి నెక్స్ట్ మీటింగ్ కి టాపిక్స్ కూడా డిసైడ్ చేయడం జరిగిందీ.
చివరగా హిమాయత్ నగర్ నుంచి వచ్చిన మిత్రులు మణికంఠ గారు మీటింగ్ చాల బాగా జరిగిందీ అని సంతోషం వ్యక్తపరుస్తూ ఇలాంటి మీటింగ్స్ ఇచ్చే కిక్ చాల బాగుంది అని అన్నారు.
అందరి మొహాల్లో అదో తెలియని సంతోషం ,ఆనందం.
పేరు పేరున ఈ మీటింగ్ కి హాజరైన అందరికి  ధన్యవాదాలు.
వచ్చే మీటింగ్ కి మీరు మీ మిత్రులతో తప్పక వస్తారని ఆశిస్తూ…..

మా cera రీడర్స్ మీటింగ్స్ లో మీరు పాల్గొనాలని అనుకుంటే ఎందుకు ఆలస్యం…
ఫోరం లో రిజిస్టర్ అవండి -రిజిస్ట్రేషన్ ఫ్రీ

www.computerera.co.in/forum

లేదా క్రింద ఉన్న మెయిల్ ఐడీ కి మెయిల్ చేయండి

Cera

Cera


నెల ఆఖరి ఆదివారం 28th న మిమ్మల్ని మళ్ళి కలుస్తాము(june -28th)

~~పవన్ మారెడ్డి~~


Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!